Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్FIH Pro-League: ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమి

FIH Pro-League: ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమి

ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్.ఐ.హెచ్.) పురుషుల ప్రో లీగ్ 2022-23 మ్యాచ్ ల్లో నిన్న బెల్జియం చేతిలో ఓటమి పాలైన ఇండియా నేడు బ్రిటన్ తో జరిగిన మ్యాచ్ లోనూ 4-2 తేడాతో పరాజయం పాలైంది.

గ్రేట్ బ్రిటన్ లోని లండన్ లో జరిగిన నేటి మ్యాచ్ లో…

ఆట 7, 32, 34, 54 నిమిషాల్లో బ్రిటన్ నాలుగు గోల్స్ సాధించింది. వీటిలో మూడు ఫీల్డ్ గోల్స్, ఒకటి పెనాల్టీ కార్నర్ ఉన్నాయి.

ఇండియాకు 14, 43 నిమిషాల్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్ అందించాడు.

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఇండియాను వెనక్కి నెట్టి బ్రిటన్ మొదటి స్థానానికి చేరుకుంది.

జూన్ 2,3 తేదీల్లో వరుసగా మరోసారి బెల్జియం, బ్రిటన్ జట్లతో ఇండియా తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ లూ లండన్ లోనే జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular