బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీం ఛాంపియన్ షిప్ లో ఇండియా ఓటమి పాలైంది. సెమీ ఫైనల్స్ లో చైనా చేతిలో 3-2తేడాతో పరాజయం చవిచూసింది. నిన్నటి క్వార్టర్ ఫైనల్స్ మాదిరిగానే తొలి రెండు మ్యాచ్ లు ఓటమి పాలైన ఇండియా ఆ తర్వాత రెండు మ్యాచ్ లు విజయం సాధించించి ఫైనల్స్ ఆశలు నిలబెట్టినా నిర్ణాయక చివరి మ్యాచ్ లో ఓటమి ఎదురు కావడంతో టోర్నీ నుంచి మూడో స్థానంతోనే నిష్క్రమించాల్సి వచ్చింది.
తొలి మ్యాచ్ పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 13-21;15-21తేడాతో లీ లాన్ జి చేతిలో…. రెండో మ్యాచ్ మహిళల సింగిల్స్ లో పివి సింధు 9-21; 21-16; 18-21తో గావో ఫంగ్ జీ చేతిలో ఓటమి పాలయ్యారు.
మూడో మ్యాచ్ పురుషుల డబుల్స్ లో చిరాగ్ శెట్టి- ధృవ్ కపిల జోడీ 21-19;21-19 తో విజయం సాధించి ఆశలు నిలబెట్టారు.
నాలుగో మ్యాచ్ మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీ చంద్-త్రెసా జాలీ లు 21-18; 13-21;21-19 తేడాతో విజయం సాధించి ఫైనల్స్ బెర్త్ కు ఇండియాను మరింత చేరువ చేశారు.
కానీ నిర్ణాయక చివరి మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో జోడీ 17-21;13-21 తో ఓటమి పాలైంది. దీనితో ఫైనల్స్ ఆశలు ఆవిరయ్యాయి.