Tuesday, April 1, 2025
Homeస్పోర్ట్స్సెమీస్ లో ఇండియా ఓటమి

సెమీస్ లో ఇండియా ఓటమి

India lost: ఏషియన్ ఛాంపియన్ షిప్ టోర్నీ సెమీస్ లో ఇండియా ఓటమి పాలైంది. రెండో సెమీఫైనల్లో జపాన్  5-3 తేడాతో ఇండియాను ఓడించి ఏషియన్ ఛాంపియన్స్ టోర్నీ లో తొలిసారి ఫైనల్ కు చేరుకుంది.

ఆట మొదటి నిమిషంలోనే జపాన్ గోల్ చేసింది. రెండో నిమిషంలో పెనాల్టీ కార్నర్ ను గోల్ చేసి సత్తా చాటింది. 17 వ నిమిషంలో ఇండియా ఫీల్డ్ గోల్ సాధించి బోణీ కొట్టింది. మరో నిమిషంలో అర్ధ భాగం ముగుస్తుందనగా పెనాల్టీ స్ట్రోక్ తో మూడో గోల్ సాధించింది. 35,41 నిమిషాల్లో రెండు ఫీల్డ్ గోల్స్ చేసి  సంపూర్ణ ఆధిక్యం సంపాదించింది. చివర్లో 53, 59 నిమిషాల్లో ఇండియా రెండు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది.

డిపెండింగ్ ఛాంపియన్ లుగా ఉన్న ఇండియా, పాకిస్తాన్ జట్లు రెండూ ఈసారి సెమీస్ లో ఓడిపోవడం గమనార్హం,  నేడు జరిగిన మరో సెమి ఫైనల్లో సౌత్ కొరియా 6-5 తో పాకిస్తాన్వి పై విజయం సాధించింది.

రేపు మూడో స్థానం కోసం దాయాదులు ఇండియా-పాకిస్తాన్  తలపడనున్నాయి.

Also Read : చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఇండియా విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్