Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్Hockey: ఇండియా చేతిలో కొరియా చిత్తు

Hockey: ఇండియా చేతిలో కొరియా చిత్తు

ఆసియన్  హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ-2023లో నేడు జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య ఇండియా డిపెండింగ్ ఛాంపియన్ కొరియాను 3-2 తేడాతో ఓడించి సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది.

మ్యాచ్ 6వ నిమిషంలో ఇండియా ఆటగాడు నీలకంఠ  శర్మ ఫీల్డ్ గోల్ తో తొలి పాయింట్ తెచ్చి పెట్టాడు.

12వ నిమిషంలో కొరియా ప్లేయర్ కిమ్ ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు.

23 వ నిమిషంలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్ లను మిస్ చేసుకున్న ఇండియా అదే నిమిషంలో వచ్చిన మరో అవకాశాన్ని కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ వినియోగించుకొని గోల్ సాధించి పెట్టాడు.

33వ నిమిషంలో మన్ దీప్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసి ఇండియా ఆధిక్యాన్ని 3-1 కి పెంచాడు. ఇదే క్రమంలో 31, 33 నిమిషాల్లో వచ్చిన పెనాల్టీ కార్నర్ లను కొరియా వినియోగించుకోలేకపోయింది.

ఆట చివరి పావు భాగంలో కూడా కొరియాకు లభించిన 9 పెనాల్టీ కార్నర్ లను ఇండియా ఆటగాళ్ళు దీటుగా ఎదుర్కొని నిలువరించారు.  అయితే 58వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని యంగ్ జుహిన్ గోల్ గా మలిచి స్కోరును 3-2 చేయగలిగాడు.

దీనితో ఇండియా 3-2 తో విజయం సొంతం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్