Sunday, January 19, 2025
HomeTrending Newsపొరుగు దేశాలతో మైత్రికి అడుగులు

పొరుగు దేశాలతో మైత్రికి అడుగులు

దక్షిణాసియా దేశాల మధ్య మైత్రి బంధానికి మళ్ళీ అడుగులు పడుతున్నాయి. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ దేశాలు సుధీర్గ విరామం తర్వాత ఈ రోజు సమావేశమయ్యాయి. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆ దేశ మిలిటరీ చీఫ్ నేతృత్వంలో మూడు దేశాల  జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. హిందూ మహా సముద్రంలో పరస్పర సహకారం, భద్రత అజెండాగా ఈ సమావేశం జరిగింది. హిందూ మహా సముద్ర జలాల్లో ఉగ్రవాద మూకల కట్టడి, సైబర్ నేరాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. తరచుగా సమావేశమై అపోహలకు తావులేకుండా మైత్రి బలోపేతానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

బంగ్లాదేశ్, మారిషస్, సెషల్స్ దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత పొరుగు దేశాల్లో చైనా జోక్యం పెరగటం, ఆర్థీక సాయం పేరుతో వనరుల దోపిడీ చేస్తున్న డ్రాగన్ కపట నీతిని ఆయా దేశాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి. శ్రీలంకలో ఓడరేవుల అభివృద్ధి పేరుతో చైనా ఆ దేశంపై పెత్తనం సాగించటం సింహళ పాలకులకు తలపోటుగా మారింది. మాల్దీవ్స్ పర్యాటక ప్రాజెక్టులపై కన్నేసిన చైనా ఆ దేశ ప్రజలకు భారత్ పై వ్యతిరేకత నూరిపొయటమే లక్ష్యంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్