Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్మహిళల హాకీ: ఆస్ట్రేలియా తో ఇండియా పోరు

మహిళల హాకీ: ఆస్ట్రేలియా తో ఇండియా పోరు

టోక్యో ఒలింపిక్స్  మహిళల హాకీ  విభాగంలో సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్ పోరులో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.  ఉదయం 8.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

నేడు జరిగిన పురుషుల క్వార్టర్స్ లో ఇండియా జట్టు ఇంగ్లాండ్ ను ­3-1  తేడాతో ఓడించి సెమీస్ కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మహిళల జట్టు కూడా మరోసారి సమిష్టి గా రాణించి సెమీస్ కు అర్హత సాధిస్తుందని యావత్ భారత దేశం ఆశిస్తోంది.

పూల్ మ్యాచ్ లలో మొదటి మూడింటిని కోల్పోయిన ఇండియా మహిళల జట్టు ఆ తర్వాత రాణించి మిగతా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్ లపై ఓటమి పాలైన ఇండియా ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లపై విజయం నమోదు చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్