Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్సెమీఫైనల్లో ఇండియా ఓటమి

సెమీఫైనల్లో ఇండియా ఓటమి

India for 3rd Place :
హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో జర్మనీ చేతిలో  ఇండియా 4-2 తేడాతో ఓటమి పాలైంది. ఆట మొదటి నుంచీ జర్మనీ తిరుగులేని ఆధిపత్యం చాటింది. మొదటి పావు భాగం చివర్లో పెనాల్టీ కార్నర్ ను గోల్ మలిచి 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో పావు భాగంలో 21, 24వ నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించింది, 25 వ నిమిషంలో ఇండియా ఆటగాడు ఉత్తమ్ సింగ్ గోల్ సాధించి ఇండియా శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అదే సమయం వద్ద జర్మనీ మరో పెనాల్టీ కార్నర్ తో గోల్ సాధించి 4-1 ఆధిక్యాన్ని సంపాదించింది.

మూడో క్వార్టర్ లో రెండు జట్లూ గోల్స్ సాధించలేకపోయాయి, ఆట చివరి నిమిషంలో ఇండియా కు చెందిన బాబీ సింగ్ గోల్ సాధించాడు. దీనితో ­4-2 తేడాతో పరాజయం పాలైంది.

ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం వేదికగా జరుగుతోన్న మెగా టోర్నీ ఆదివారంతో ముగియనుంది. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు జరగనున్న మ్యాచ్ లో మూడో స్థానం కోసం ఫ్రాన్స్ తో ఇండియా తలపడనుంది. జర్మనీ-అర్జెంటీనా మధ్య ఫైనల్ మ్యాచ్ సాయంత్రం ఏడున్నర గంటలకు మొదలవుతుంది.

Also Read : మయాంక్ సెంచరీ – కోహ్లీ ఔట్ వివాదాస్పదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్