Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్Ind Vs. WI: రాణించిన అశ్విన్, ఇండియా పైచేయి

Ind Vs. WI: రాణించిన అశ్విన్, ఇండియా పైచేయి

వెస్టిండీస్ తో జరుగుతోన్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నేడు మొదలైన తొలి టెస్టులో ఇండియా మొదటి రోజు పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో  విండీస్ ను 150 పరుగులకే కుప్పకూల్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో రాణించాడు. జడేజా మూడు; సిరాజ్, ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టాడు.

డొమినికా లోని విండ్సర్ పార్క్ వేదికగా జరుగుతోన్న ఈ టెస్టులో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 31 రన్స్ చేసింది.  ఓపెనర్ చందర్ పాల్ ను అశ్విన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్ కోల్పోయింది. 76 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో అత్నాంజే-హోల్డర్ లు ఆరో వికెట్ కు 41 పరుగులు జోడించారు. హోల్డర్ ను సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కీలక భాగస్వామ్యం నమోదు చేయలేకపోయింది. అత్నాంజే-47; బ్రాత్ వైట్-20; కాన్వెల్-19; హోల్డర్-18 ఫర్వాలేదనిపించారు. 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఆ తర్వాత శుభ్ మన్ గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్… కెప్టెన్ రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్  ఇండియా ఇన్నింగ్స్  ఆరంభించాడు. జైస్వాల్-40; రోహిత్-30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular