Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Hockey Pro-League: ఆసీస్ పై ఇండియా షూటౌట్ విజయం

Hockey Pro-League: ఆసీస్ పై ఇండియా షూటౌట్ విజయం

ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఇండియా 2-2 (4-3) తేడాతో షూటౌట్ విజయం సాధించింది. రూర్కెలాలోని బిర్సాముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఆట రెండో నిమిషంలోనే వివేక్ సాగర్ పెనాల్టీ కార్నర్ తో ఇండియాకు గోల్ అందించాడు. 37నిమిషం వద్ద ఆసీస్ పెనాల్టీ స్ట్రోక్ గోల్ సాధించింది. 47వ నిమిషంలో సుఖ్ జీత్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి ఇండియా కు 2-1 ఆధిక్యం తెచ్చిపెట్టాడు.  52వ నిమిషంలో ఆసీస్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ చేసి స్కోరు సమం చేసింది.  పూర్తి సమయానికి డ్రా గా ముగియడంతో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది.

ఇండియా గోల్ కీపర్ రవీంద్రన్ శ్రీజేష్  సమర్ధంగా ఆడి గోల్ నిలువరించగలిగాడు. దీనితో 4-3తో విజయం ఇండియా సొంతమైనది.

ఈ టోర్నీలో ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లు ఆడిన ఇండియా ఐదు విజయాలు, రెండు షూటౌట్ గెలుపు, ఒక ఓటమితో మొత్తం 19పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ఇండియా తన త్రార్వాతి మ్యాచ్ ను మే న26న బెల్జియం తో లండన్ వేదికగా ఆడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్