Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్ఇండియా-సౌతాఫ్రికా రెండో టెస్ట్: ఒకేరోజు 23 వికెట్లు

ఇండియా-సౌతాఫ్రికా రెండో టెస్ట్: ఒకేరోజు 23 వికెట్లు

ఇండియా-సౌతాఫ్రికా మధ్య కేప్ టౌన్ లో మొదలైన రెండో టెస్టులో తొలిరోజే ఆట సగం పైగా పూర్తయింది.  మొత్తం 23 వికెట్లు పడ్డాయి. వికెట్ల పతనంలో ఇది ఓ రికార్డు.  పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండే ఈ పిచ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టు భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ దెబ్బకు23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సిరాజ్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి ఆరు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు సాధించారు.   బెడింగ్ హామ్-12, వెర్రీన్-16 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇండియా 17 పరుగుల వద్ద ఓపెనర్ యశస్వి జైస్వాల్ (డకౌట్) వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కు రోహిత్ – గిల్ లు 55 పరుగులు జోడించారు. రోహిత్ 39; గిల్ 36 పరుగులు చేసి వెనుదిరిగారు. కోహ్లీ 46 పరుగులు చేసి 8వ వికెట్ గా ఔటయ్యాడు. తర్వాత వచ్చిన వారిలో కెఎల్ రాహుల్ మినహా మిగిలిన వారంతా డకౌట్ కావడం విశేషం.153 పరుగుల వద్ద ఆరు వికెట్లు చేజార్చుకుంది. ఇండియా 34.5 ఓవర్లు ఆడింది.

సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, నిగిడి, బర్గర్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.

98 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి  62 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. డీన్ ఎల్గర్-12; స్టబ్స్-1; టోనీ జార్జి-1 రన్స్ చేసి వెనుదిరిగారు. మార్ క్రమ్-36; బెడింగ్ హామ్-7 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో ముఖేష్ 2; బుమ్రా 1 వికెట్ సాదించారు.

సౌతాఫ్రికా ఇంకా 36 పరుగులు వెనకబడి ఉంది.

తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించి 1-౦ తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్