Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Ind Vs Eng: రాజ్ కోట్ టెస్టులో ఇండియా ఘనవిజయం

Ind Vs Eng: రాజ్ కోట్ టెస్టులో ఇండియా ఘనవిజయం

రాజ్ కోట్ టెస్టు లో ఇంగ్లాండ్ పై ఇండియా 434 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత స్పిన్ బౌలింగ్ కు బెన్ స్టోక్స్ సేన దాసోహం అయ్యింది. జడేజా మరోసారి ఐదు వికెట్లతో సత్తా చాటగా…. కుల్దీప్ యాదవ్ 2; బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 430 పరుగుల వద్ద ఇండియా డిక్లేర్డ్ చేసింది. మొత్తంగా 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 122 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టు లో మార్క్ వుడ్ చేసిన 33 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. జాక్ క్రాలే-11; బెన్ స్టోక్స్-15; బెన్ ఫోక్స్-16; టామ్ హార్ట్ లీ – 16 పరుగులు చేశారు.

రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్