Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్చివరి వన్డేలో ఇండియా మహిళల గెలుపు

చివరి వన్డేలో ఇండియా మహిళల గెలుపు

India W won: న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో ఇండియా మహిళలు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బ్యాటింగ్ లో స్మృతి మందానా, హార్మన్ ప్రీత్ కౌర్, కెప్టెన్ మిథాలీ రాజ్ రాణించడంతో గెలుపు సాధ్యమైంది. ఏకైక టి 20తో పాటు ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను కూడా కోల్పోయిన ఇండియా చివరి మ్యాచ్ లో విజయం సాధించి పరువు నిలిపింది. క్వీన్ స్టోన్స్ లోని జాన్ డేవిస్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 27 పరుగుల వద్ద కివీస్ బేట్స్(17) రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్, కెప్టెన్ సోఫీ డివైన్, అమేలియా కెర్ర్  రెండో వికెట్ కు 68 పరుగులు జోడించారు. డివైన్  34 పరుగులు చేసి ఔటయ్యింది. అమేలియా కెర్ర్ మరోసారి రాణించి 66పరుగులతో రాణించింది. లారెన్ డౌన్, జేన్సేన్ చెరో 30 పరుగులు చేశారు. కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో  గాయక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ్ రానా తలా మూడు; మేఘనా సింగ్, పూనం యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఆ తర్వాత  ఇండియా 29 పరుగులకే షఫాలీ వర్మ (9) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.  దీప్తి శర్మ 21 పరుగులు చేసింది. స్మృతి మందానా 84 బంతుల్లో 9 ఫోర్లతో 71; హార్మన్ ప్రీత్ సింగ్ 66 బంతుల్లో  6 ఫోర్లు, 1 సిక్సర్ తో 63 చేయగా, కెప్టెన్ మిథాలీ రాజ్  66 బంతుల్లో 6 ఫోర్లతో 57 పరుగులతో అజేయంగా నిలవడంతో 46 ఓవర్లలో 4  వికెట్లు మాత్రమే కోల్పోయి 255పరుగులు చేసి విజయం సాధించింది.

స్మృతి మందానా కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించగా, ఈ సిరీస్ లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచిన అమేలియా కెర్ర్ కు ‘ప్లేయర్ అఫ్ ది సిరీస్’ దక్కింది.

Also Read : నాలుగో మ్యాచ్ లోనూ ఇండియా పరాజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్