Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్Ind Vs Aus: తొలి వన్డేలో ఇండియా విజయం

Ind Vs Aus: తొలి వన్డేలో ఇండియా విజయం

కెఎల్ రాహుల్ చాలా రోజుల తరువాత ఓ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వచ్చాడు. జడేజాతో కలిసి ఆరో వికెట్ కు 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇండియా 5 వికెట్లతో గెలుపొందింది. తొలుత ఆసీస్ ను 188 పరుగులకే ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. స్వల్ప లక్ష్య సాధనలో తడబడ్డ ఇండియా 39 పరుగులకే నాలుగు వికెట్లు (ఇషాన్ కిషన్ -; శుభ్ మన్ గిల్-; విరాట్ కోహ్లీ-; సూర్య కుమార్ యాదవ్-) కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్- కెప్టెన్ పాండ్యాలు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. పాండ్యా 25 పరుగులు చేసి ఔట్ కాగా, రాహుల్-75; జడేజా-45 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. 39.5 ఓవర్లలో ఐదు వికెట్లకు 191 పరుగులు సాధించింది.

ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3; మార్కస్ స్టోనిస్-2 వికెట్లు పడగొట్టారు.

ముంబై వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్లోనే ఆసీస్ ట్రావిస్ హెడ్ (5) సిరాజ్ వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు. మిచెల్ మార్ష్-స్టీవెన్ స్మిత్ లు రెండో వికెట్ కు 65 రన్స్ చేశారు. జట్టులో మార్ష్ ఒక్కడే 81 (65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులతో రాణించాడు. జోస్ ఇంగ్లిస్­-26, స్మిత్-22 లు ఫర్వాలేదనిపించారు. ఆసీస్ 35.4 ఓవర్లలో 188 పరుగులతో ఆలౌట్ అయ్యింది. సిరాజ్, షమీ చెరో మూడు; జడేజా రెండు; హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్  చెరో వికెట్ పడగొట్టారు.

రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్