Thursday, January 23, 2025
Homeస్పోర్ట్స్నాలుగో టి20లోనూ ఇండియాదే విజయం: సిరీస్ కైవసం

నాలుగో టి20లోనూ ఇండియాదే విజయం: సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది. నేడు జరిగిన నాలుగో మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెల్చుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఇచ్చిన 153 పరుగుల విజయ లక్ష్యాన్ని వికెట్ నష్ట పోకుండా 15.2 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వి జైస్వాల్ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 93; కెప్టెన్ శుభ్ మన్ గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకోగా, జింబాబ్వే తొలి వికెట్ కు 63 రన్స్ చేసింది. ఓపెనర్లు మాధవెరే-25, మరుమణి-32 పరుగులు చేశారు. కెప్టెన్ సికిందర్ రాజా 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 రన్స్ చేశారు. ఈ ముగ్గురు మినగా మిగిలినవారు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.

ఇండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2; తుషార్ దేశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు.

యశస్వి జైస్వాల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ రేపు ఇదే వేదికగా జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్