Sunday, January 19, 2025
HomeUncategorizedInd Vs SA: ఇండియాదే రెండో టెస్ట్: సిరీస్ డ్రా

Ind Vs SA: ఇండియాదే రెండో టెస్ట్: సిరీస్ డ్రా

ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  దీనితో సిరీస్ డ్రా గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు కోల్పోయిన సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ ఆతిథ్య జట్టును కకావికలం చేయగా రెండో ఇన్నింగ్స్ లో ఆ బాధ్యతను బుమ్రా తీసుకున్నారు. ఆరు వికెట్లతో బుమ్రా సత్తా చాటగా… ముకేష్ కుమార్ 2, సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు. సౌతాఫ్రికా జట్టులో ఓపెనర్ ఏడెన్ మార్ క్రమ్ సెంచరీ తో రాణించాడు. 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ గా వెనుదిరిగాడు.

విజయానికి 79 పరుగులు అవసరం కాగా 44 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ 28 రన్స్ చేసి ఔట్ కాగా, గిల్-10; కోహ్లీ-12 పరుగులు చేసి వెనుదిరిగారు. రోహిత్ శర్మ-17; శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. రబడ, జాన్సెన్, బర్గర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

మహమ్మద్ సిరాజ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది. ప్లేయర్ అఫ్ ద సిరీస్ ను దీన్ ఎల్గర్, బుమ్రా సంయుక్తంగా అందుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్