Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్లార్డ్స్ టెస్ట్ లో ఇండియా ఘనవిజయం

లార్డ్స్ టెస్ట్ లో ఇండియా ఘనవిజయం

రెండో టెస్టులో ఇండియా ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో భాగంగా చారిత్రక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో చివరిరోజు బౌలర్లు చెలరేగడంతో ఇండియా విజయం సాధించి సిరీస్ లో 1-0 లీడ్ సాధించింది.

ఆరువికెట్ల నష్టానికి 181పరుగుల వద్ద చివరిరోజు ఆట మొదలు పెట్టిన ఇండియా మరో 117 జోడించి 298 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహమ్మద్ షమీ 70 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 56 పరుగులు చేయడం విశేషం. మరో బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా 34 పరుగులతో అజేయంగా నిలిచాడు.

60 ఓవర్లలో 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సిరాజ్, బుమ్రా, ఇశాంత్ ల బౌలింగ్ ధాటికి 120 పరుగులకే కుప్పకూలింది. దీనితో ఇండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరాజ్-4, బుమ్రా-3 ఇషాంత్ శర్మ-2 వికెట్లు పడగొట్టగా మరొకటి షమీకి దక్కింది. కే.ఎల్. రాహుల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular