Sunday, March 15, 2026
Homeస్పోర్ట్స్3rd T20 Tie: ఇండియాదే టి20 సిరీస్

3rd T20 Tie: ఇండియాదే టి20 సిరీస్

Siraj: ఇండియా-న్యూజిలాండ్ మధ్య నేపియర్ లో నేడు మొదలైన మూడో టి 20 టై గా ముగిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో భాగంగా  ఇండియా 9 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి  75 పరుగులు పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం పడింది. మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకపోవడంతో డక్ వర్త్ లూయీస్ పధ్ధతి ద్వారా మ్యాచ్ టై అయినట్లు ప్రకటించారు.

తొలుత కివీస్ జట్టు 9 పరుగులకే ఓపెనర్ ఫిన్ అల్లెన్ వికెట్ (3) కోల్పోయింది.  కాంప్ మాన్ కూడా 12  పరుగులే చేసి వెనుదిరిగాడు. మూడో వికెట్ కు డెవాన్ కాన్వే- గ్లెన్ ఫిలిప్స్ లు 86 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కాన్వే-59; ఫిలిప్స్-54 పరుగులు చేసిఔటయ్యారు. వీరిద్దరి తరువాత కివీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. అర్ష్ దీప్ వేసిన 19వ ఓవర్లో మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయింది. ఇండియా బౌలర్లలో సిరాజ్, అర్ష్ దీప్ చెరో నాలుగు, హర్షల్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇండియా 21 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది (ఇషాన్ కిషన్-10; రిషభ్ పంత్-11; శ్రేయాస్ అయ్యర్ డకౌట్). నాలుగో వికెట్ కు సూర్య కుమార్ యాదవ్- పాండ్యా 39రన్స్ చేశారు. సూర్య 13 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. పాండ్యా 30, దీపక్ హుడా 9 పరుగులతో క్రీజులో ఉండగా వర్షం ఆటకం కలిగించింది. టిమ్ సౌతీ రెండు; అడమ్ మిల్నే, ఇష్ సోది చెరో వికెట్ పడగొట్టారు.

సిరాజ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, సూర్య కుమార్ యాదవ్ కు ‘ ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular