Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్టి-20 సిరీస్ కూడా ఇండియాదే

టి-20 సిరీస్ కూడా ఇండియాదే

T20 Series also: వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20లో కూడా ఇండియా విజయం సాధించి టి 20 సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది.  ఇండియా విసిరిన 187 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోవడంలో విండీస్ విఫలమైంది. మొదట్లో నెమ్మదిగా ఆడడంతో చివర్లో రన్ రేట్ పెరిగిపోయింది. నికోలస్ పూరన్-62 (41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు); పావెల్-68 నాటౌట్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో 8 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది.  ఇండియా బౌలర్లలో భువనేశ్వర్, యజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్ నిరాశపరిచి కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు, కెప్టెన్ రోహిత్ కూడా 19పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు.  విరాట్ కోహ్లీ- రిషభ్ పంత్, వెంకటేష్ అయ్యర్ రాణించడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  186 పరుగులు చేసింది. పంత్ 28 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సర్ తో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 41 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సర్ తో 52;  వెంకటేష్ అయ్యర్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ తో 33 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రోస్తాన్ చేజ్ మూడు; కత్రెల్, షెఫర్డ్ చెరో వికెట్ సాధించారు.

రిషభ్ పంత్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది, చివరి టి20 ఎల్లుండి ఆదివారం ఇదే వేదికగా జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్