India Won The Test Series :
ముంబై టెస్ట్ లో ఇండియా 372 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ రాణించడంతో రెండో ఇన్నింగ్ లో న్యూజిలాండ్ 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఐదు వికెట్లకు 140 పరుగులతో నేడు నాలుగోరోజు ఆట మొదలుపెట్టిన కివీస్ మరో 25 పరుగులకే మిగిలిన ఐదు వికెట్లూ కోల్పోయి ఓటమి పాలైంది. 2 పరుగులతో నేడు క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర నేడు మరో 16 జోడించి 18 పరుగులకు ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కేల్ జేమిసన్, టిమ్ సౌతీ డకౌట్ కాగా సోమర్ విల్లె కేవల ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కివీస్ బ్యాట్స్ మ్యాన్ నికోల్స్ 36 పరుగుల వ్యక్తిగత ఓవర్ నైట్ స్కోరుతో నేడు బరిలోకి దిగి మరో 8 జోడించి 44 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు.
రెండో ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ పడింది.
కాన్పూర్ లో జరిగిన మొదటి టెస్ట్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే, రెండో టెస్టులో ఘన విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తేడాతో ఇండియా గెల్చుకుంది. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ గా ఎంపిక కాగా, రెండో టెస్ట్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ దక్కించుకున్నాడు.
Also Read :రెండో టెస్ట్: 62కే కూలిన కీవీస్