Monday, March 9, 2026
Homeస్పోర్ట్స్Ind Vs Eng: విశాఖ టెస్టులో ఇండియా ఘన విజయం

Ind Vs Eng: విశాఖ టెస్టులో ఇండియా ఘన విజయం

విశాఖ టెస్టులో ఇండియా 1౦6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్, జస్ ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసి వెనక్కు పంపారు. 399 పరుగుల విజయ లక్ష్యంతో నిన్న రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ నేడు చెప్పుకోదగ్గ భాగస్వామ్యం నమోదు చేయలేక వికెట్లు చేజార్చుకుంది.

ఓపెనర్ జాక్ క్రాలే-73 పరుగులతో రాణించగా, బెన్ ఫోక్స్-36; టామ్ హార్ట్ లీ-36; బెయిర్ స్టో-26; ఓలీ పోప్-23; రెహాన్ అహ్మద్-23 రన్స్ చేశారు.  292 పరుగులకు ఆతిథ్య జట్టు ఆలౌట్ అయ్యింది.

బుమ్రా, అశ్విన్ చెరో 3; ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ రనౌట్ గా వెనుదిరిగాడు.

రెండు ఇన్నింగ్స్ లో మొత్తం 9 వికెట్లు సాధించిన జస్ ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించింది.

ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను ఇండియా 1-1తో సమం చేసింది.

మూడో టెస్ట్ ఫిబ్రవరి 15న రాజ్ కోట్ లో మొదలు కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular