Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్శ్రీలంక షెడ్యూల్ ఖరారు : త్వరలో జట్టు ఎంపిక

శ్రీలంక షెడ్యూల్ ఖరారు : త్వరలో జట్టు ఎంపిక

శ్రీలంకలో జరిగే భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారైంది. ప్రసారకర్త సోనీ నెట్ వర్క్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. జూలై 13, 16, 18 తేదీల్లో వన్డే మ్యాచ్ లు, 21, 23, 25 తేదీల్లో టి-20 మ్యాచ్ లు జరగనున్నాయి.

ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా జూన్ 16 నుంచి ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ పై ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, మనదేశంలో యువ ఆటగాళ్ళు మాత్రం శ్రీలంక టూర్ పై కన్నేశారు. ఐపిఎల్ లో తమ సత్తా చాటి ఉత్సాహంతో ఉరకలేస్తున్న ఆటగాళ్ళు భారత క్రికెట్ పరిమిత ఓవర్ల జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ ను నిర్వహించే వేదికలను శ్రీలంక క్రికెట్ బోర్డు త్వరలో ఖరారు చేయనుంది. ఈ భారత జట్టుకు ఇప్పటికే రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా ఎంపిక చేసింది బిసిసిఐ.
శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ లలో ఒకరిని ‘పరిమిత’ కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సారధి తో పాటు జట్టు ఎంపిక జూలై మొదటి వారంలోగా బిసిసిఐ పూర్తి చేస్తుంది.

ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న టెస్టు జట్టు భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో ఐపిఎల్ కోసం ఎమిరేట్స్ చేరుకుంటుంది. అక్టోబర్ ¬15న ఐపిఎల్ పూర్తయిన తర్వాతే టెస్టు జట్టు సభ్యులు స్వదేశానికి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్