Sunday, January 19, 2025
HomeTrending Newsఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థి మృతి

ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థి మృతి

ఉక్రెయిన్ దేశంపై చేస్తున్న రష్యా బలగాల దాడిలో భారతీయ విద్యార్థి ఈ రోజు ఉదయం మృతి చెందాడు. అక్క‌డికి చ‌దువు నిమిత్తం వెళ్లిన భార‌త విద్యార్థి శేఖరప్ప నవీన్ (21) మృతిచెందాడని భార‌త విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. ఖార్కివ్ లో రష్యా సైనికుల కాల్పుల్లో విద్యార్థి చ‌నిపోయాడ‌ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందం బాగ్చి ట్విట్టర్ ద్వారా తెలిపారు. మృతిచెందిన విద్యార్థి క‌ర్ణాట‌క‌కు చెందిన న‌వీన్ గా గుర్తించారు. భోజ‌నం కోసం విద్యార్థి న‌వీన్ బ‌య‌ట‌కు వెళ్లిన సంద‌ర్భంగా కాల్పులు జ‌ర‌గ‌డంతో కాల్పుల్లో విద్యార్థి చ‌నిపోయిన‌ట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి వివరించారు.

కర్ణాటక హవేరి జిల్లా చెళగేరి గ్రామానికి చెందిన నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ఈ విషయంపై సానుభూతి తెలుపుతున్నామని బాగ్చి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గ‌త ఆరు రోజులుగా ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు చేస్తున్న వైమానిక దాడులు, యుద్ధ ట్యాంక్ ల దాడులతో వణికిపోతున్న ఖార్కివ్ నగరంలో ఇంకా భారీ సంఖ్యలోనే భారతీయ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్