Saturday, November 23, 2024
Homeఅంతర్జాతీయంఆఫ్ఘన్ కు ఇండియా వైద్య పరికరాలు

ఆఫ్ఘన్ కు ఇండియా వైద్య పరికరాలు

ఆఫ్ఘనిస్తాన్ కు భారతదేశం వైద్య పరికరాలను సరఫరా చేసింది. ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో మానవతా దృక్పథంతో ఈ సహకారం అందించినట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధి వెల్లడించారు. కాబూల్ లోని ఇందిరాగాంధీ పిల్లల ఆస్పత్రికి వీటిని అందజేయాల్సిందిగా ఆఫ్ఘన్ లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులకు ఇండియా సూచించింది.

ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న 10 మంది భారతీయులతో పాటు మరో 94 మంది ఆఫ్ఘన్ సంతతి వారిని  ప్రత్యేక విమానం ద్వారా కాబూల్ నుంచి న్యూఢిల్లీ కి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్ లో గత ఆర్నెల్లుగా నెలకొన్న సంక్షోభ, అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు  ‘ఆపరేషన్ దేవి శక్తి’ పేరుతో ఓ మిషన్ ను భారత ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకూ మొత్తం 669 మందిని ఈ మిషన్ ద్వారా ఇండియాకు తీసుకువచ్చినట్లు విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఆగస్ట్ నెలలోనే 565 మందిని ఇండియాకు తరలించగా వీరిలో 438 మంది స్వదేశానికి చెందినవారు కాగా మిగిలిన వారు ఆఫ్ఘన్ హిందూ-సిఖ్ మైనార్టీలు, ఆఫ్ఘనిస్తాన్ సంతతికి చెందినవారు ఉన్నారు.  ఇంకా మిగిలిపోయిన వారిని నేడు స్వదేశానికి రప్పించారు. తిరుగు పయనంలో ఈ వైద్య పరికరాలను విమానం ద్వారా పంపారు.

Also Read : ఓమిక్రాన్ ఎంత ప్రమాదకరం ?

RELATED ARTICLES

Most Popular

న్యూస్