Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్లాంగ్ రన్నర్ హరిచంద్ కన్నుమూత

లాంగ్ రన్నర్ హరిచంద్ కన్నుమూత

Great: ఏసియన్ గేమ్స్ లో రెండు సార్లు గోల్డ్ మెడలిస్ట్, రెండుసార్లు ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించిన  భారత అథ్లెట్, లాంగ్ రన్నర్ హరిచంద్ నేటి ఉదయం అయన స్వగ్రామం హోషియాపూర్ లో కన్నుమూశారు.

1953 ఏప్రిల్ 1న పంజాబ్ రాష్ట్రంలోని హోషియాపూర్ సమీపంలో ఘోరేవా గ్రామంలో జన్మించిన హరిచంద్ లాంగ్ రన్నింగ్ లో  ఇండియాకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. 1976లో కెనడాలోని మోంట్ రియల్ లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో 10కిలోమీటర్ల రన్నింగ్ లో ఎనిమిదో స్థానంలో నిలిచారు. 28నిమిషాల 48సెకన్లలో అయన ఈ పరుగు పూర్తి చేశారు. ఇది 32ఏళ్ళపాటు జాతీయ స్థాయి రికార్డు గా నిలిచింది.

1975 లో సౌత్ కొరియా లోని సియోల్ లో జరిగిన ఏషియన్ ఛాంపియన్ షిప్స్ లో 10వేల మీటర్లలో మొదటి, 5వేల మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంలో నిలిచారు.  థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో 1978లో జరిగిన ఏసియన్ గేమ్స్ లో 5 వేలు, 10 వేల మీటర్ల పరుగు పందెంలో అయన  రెండు బంగారు పతకాలు సాధించారు.

భారత అథ్లెటిక్స్ రంగంలో హరిచంద్ చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అర్జున అవార్డుతో సత్కరించింది. ఆయన  మృతి పట్ల పలువురు క్రీడాకారులు, అథ్లెట్లు సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్