ఇండియా జట్టు ఆసియ కబడ్డీ పురుషుల ఛాంపియన్ షిప్ -2023 ను నిలబెట్టుకుంది. ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు ఈ టోర్నమెంట్ జరగగా ఎనిమిది సార్లు ఇండియా విజేతగా నిలవడం గమనార్హం. నిన్న జరిగిన సెమీ ఫైనల్లో 33-28తో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచిన ఇండియా ఫైనల్లో కూడా ఇరాన్ తోనే తలపడింది. నేడు ఉదయం జరిగిన మ్యాచ్ లో జపాన్ పై 71-13 తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది.
నేటి ఫైనల్లో 42-32 తేడాతో ఇరాన్ ను ఓడించి టైటిల్ ను గెల్చుకుంది.
దక్షిణ కొరియాలోని బుసాన్ లో ఈ నెల 27 న మొదలైన ఈ టోర్నీ నేటి ఫైనల్ తో ముగిసింది. ఇండియా తో పాటు ఇరాన్, చైనీస్ తైపీ, సౌత్ కొరియా, హాంగ్ కాంగ్, జపాన్ దేశాలు పాల్గొన్నారు. 1980లో ఆసియ ఛాంపియన్ షిప్ తొలి టోర్నమెంట్ ఇండియాలోని కోల్ కతాలో జరగగా ఇండియా విజయం సాధించింది. 2003లో మలేషియా లో జరిగిన టోర్నీలో మాత్రమే ఇండియా ఓటమి పాలైంది. మిగిలిన అన్ని టోర్నీలూ ఇండియా ఖతాలోనే పడ్డాయి.