Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్హాకీలో నాలుగో విజయం

హాకీలో నాలుగో విజయం

టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో ఇండియా జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకొంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ లో చోటు సంపాదించుకున్న ఇండియా నేడు ఆతిథ్య జపాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 5-3 తేడాతో విజయం సాధించి పూల్ ‘ఏ’లో రెండో స్థానంలో నిలిచింది.  ఈ పూల్ లో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, స్పెయిన్, న్యూ జిలాండ్, అర్జెంటినా, జపాన్ జట్లు ఉన్నాయి. ఒక్క ఆస్ట్రేలియా తో మినహా మిగిలిన అన్ని జట్లపై ఇండియా విజయం సాధించింది.

పూల్ ‘ఏ’ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండియా, స్పెయిన్ జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించాయి. అర్జెంటీనా, న్యూజిలాండ్ మ్యాచ్ లో గెలిచే జట్టు ఈ పూల్ నుంచి నాలుగో జట్టుగా అర్హత సాధించనుంది. ఆగస్టు 1 న జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో ఇండియా ఎవరితో తలపడనుందో ఈ రాత్రికి ఖరారు కానుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్