Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్ICC Rankings: అన్ని ఫార్మాట్లలోనూ ఇండియా టాప్

ICC Rankings: అన్ని ఫార్మాట్లలోనూ ఇండియా టాప్

క్రికెట్ లో మరో అరుదైన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. కొంత కాలంగా టి 20, వన్డే ఫార్మాట్లలో టాప్ ప్లేస్ లో ఉన్న మన జట్టు తాజా ర్యాంకింగ్స్ లో టెస్ట్ ఫార్మాట్ లో కూడా నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకొని రికార్డుల కెక్కింది.

నాలుగు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇండియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. నాగపూర్ లో  ఫిబ్రవరి 9 న మొదలైన మొదటి టెస్ట్ ను మూడోరోజునే ఇండియా ఇన్నింగ్స్ 132  పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. ఈ విజయంతో ఇండియా టెస్టుల్లో టాప్ కు చేరుకుంది.

ఆసీస్ సిరీస్ కు ముందు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే, టి 20 సిరీస్ లను కూడా ఇండియా చేజిక్కించుకున్న సంగతి విదితమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్