Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్సింగిల్స్ లో ఆశ - డబుల్స్ లో నిరాశ

సింగిల్స్ లో ఆశ – డబుల్స్ లో నిరాశ

Singles- 4 Wins :
స్పెయిన్ లో జరుగుతోన్న వరల్డ్ ఛాంపియన్ షిప్ లో నేడు ఐదోరోజు సింగిల్స్ లో ఇండియా నాలుగు విజయాలు సాధించింది, డబుల్స్ లో మాత్రం ఓటమి పాలైంది.

⦿మహిళల సింగిల్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. థాయ్ లాండ్ క్రీడాకారిణి చోచువాంగ్ ను 21-14; 21-18 తేడాతో ఓడించింది.

⦿ పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ 21-10, 21-15తో చైనా ఆటగాడు లు గుంగ్ జు పై విజయం సాధించాడు.

⦿ పురుషుల సింగిల్స్ లో రెండో మ్యాచ్ లో ప్రన్నోయ్  16-21; 21-8, 22-20తో డెన్మార్క్ ఆటగాడు రస్మస్ జేమ్కే ను ఓడించాడు.

⦿ పురుషుల సింగిల్స్ లో మరో మ్యాచ్ లో లక్ష్య సేన్  21-13, 21-8 తో గ్వాటేమాల క్రీడాకారుడు కెవిన్ కార్దోన్ ను ఓడించాడు.

⦿ మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప- సిక్కి రెడ్డి జోడీ ¬21-13; 21-15 తేడాతో థాయ్ లాండ్ జోడీ కిటితారకుల్-రవిందా చేతిలో ఓటమి పాలయ్యారు.

⦿ పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయి రాజ్- చిరాగ్ శెట్టి ద్వయం మలేషియా జోడీ ఒంగ్ ఏ సిన్- టియో ఈ ఇ పై 22-20; 18-21; 21-15 తేడాతో ఓటమి పాలయ్యారు.

Also Read : బ్యాడ్మింటన్: ప్రన్నోయ్ , మహిళా జోడీ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్