Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్బాక్సింగ్ లో రాణించిన ఇండియా

బాక్సింగ్ లో రాణించిన ఇండియా

దుబాయ్ లో జరుగుతున్న ఆసియన్ యూత్ అండ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ ­2021లో మొదటి రోజు ఇండియా ఆటగాళ్ళు సత్తా చాటారు. జూనియర్ బాలుర విభాగంలో రోహిత్ (48 కిలోలు); అంకుష్(66 కిలోలు), గౌరవ్ (70 కిలోలు)లు ఆయా విభాగాల్లో తమ ప్రత్యర్థులపై తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకొని సెమీ ఫైనల్లో బెర్తులు ఖరారు చేసుకున్నారు.

రోహిత్ సిరియాకు చెందిన అల్ హసన్ కాడోస్ పై ­5-0;  అంకుష్ కువైట్ కు చెందిన బడేర్ సాహెబ్ పై ­5-0 తేడాతో; గౌరవ్ కువైట్ కు చెందిన యాకుబ్ సాదుల్లాపై ఆర్ఎస్సీ (రిఫరీ స్టాపింగ్ ద కాంటెస్ట్) ద్వారా సెమీస్ లో అడుగుపెట్టారు.

మరోవైపు, ఆశిష్ (54 కిలోలు); అన్శూల్ (57 కిలోలు), ప్రీత్ మాలిక్ (63 కిలోలు)లు మొదటి రోడ్లలో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి తర్వాతి రౌండ్లోకి చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్