Monday, March 9, 2026
Homeస్పోర్ట్స్Badminton: చైనా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరు

Badminton: చైనా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరు

చైనా ఓపెన్ లో భారత ఆటగాళ్ళు  ఏ ఒక్కరూ ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్ కు కూడా చేరుకోలేకపోయారు. నిన్న తొలిరోజు మ్యాచ్ లో పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్, ప్రియాన్షు రాజావత్… పురుషుల డబుల్స్ లో ఎమ్మార్ అర్జున్, ధృవ్ కపిల…మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీ చంద్- త్రెసా జాలీలు తొలి రౌండ్ లోనే ఓటమి పాలై వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

నేడు రెండోరోజు మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్- సిక్కీ రెడ్డి జోడీ మలేషియా జోడీ చెన్ టాంగ్ జీ- తో ఈ జంట చేతిలో 21-15-21-16 తేడాతో ఓటమి పాలయ్యారు.

పురుషుల డబుల్స్ లో స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి లపై ఇండోనేషియా ఆటగాళ్ళు ముహమ్మద్ శోహిబుల్-బగాస్ మౌలానా  21-17; 11-21; 21-17 తేడాతో గెలుపొందారు.

నేడు ఈ రెండు పరాజయాలతో చైనా ఓపెన్ లో ఇండియా కథ ముగిసింది.

ఈ నెల 12 నుంచి హంగ్ కాంగ్ ఓపెన్ మొదలు కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular