Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్India (W) Vs. England (W): తొలి వన్డేలో ఇండియా గెలుపు

India (W) Vs. England (W): తొలి వన్డేలో ఇండియా గెలుపు

ఇండియా- ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇండియా ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మందానా మరోసారి తన సత్తా చాటి 99 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్సర్ తో 91 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది.

హోవ్ లోని కంట్రీ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, 21 పరుగులకు ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరూ (ఎమ్మా లాంబ్-12; బ్యూమాంట్-7) ఔటయ్యారు. జట్టులో డేవిడ్సన్ రిచర్డ్స్-50(నాటౌట్) ; డేనియల్ వ్యాట్-43; ఎక్సెల్ స్టోన్-31;  సోఫియ డంక్లీ-29; చార్లోట్ డీన్-24 పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు; జులన్ గోస్వామి, స్నేహ రానా, మేఘన సింగ్, గాయక్వాడ్, హర్లీన్ డియోల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇండియా 3 పరుగులకే తొలి వికెట్ (షఫాలీ వర్మ-1) కోల్పోయింది. యస్తికా భాటియా 47 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 50 పరుగులు చేసి చార్లోట్ డీన్ బౌలింగ్ లో ఔటయ్యింది. స్మృతి మందానా (91)ఔటైన తర్వాతా కెప్టెన్ హర్మన్ ప్రీత్-74(94 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సర్)- హర్లీన్ డియోల్-6 కలిసి జట్టును గెలిపించారు. ఇండియా 44.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. విన్నింగ్ షాట్ ను సిక్సర్ గా మలిచింది హర్మన్.

స్మృతి మందాన కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్