Thursday, April 3, 2025
HomeTrending Newsఅంతర్జాతీయ క్రికెట్ కు మిథాలీ గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలీ గుడ్ బై

Good Luck Mithali: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు మిథాలీ కాసేపటి క్రితం ప్రకటించింది.   ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్నాళ్ళ పాటు తనకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. మీ అందరి సహకారం, ఆశీర్వాదాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నట్లు వెల్లడించింది.

టెస్ట్ క్రికెట్ లో 12 మ్యాచ్ లు ఆడి 699పరుగులు చేసింది. వీటిలో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీ లు ఉన్నాయి. అత్యధిక స్కోరు 214

232 వన్డేలు ఆడిన మిథాలీ 7805 పరుగులు చేసింది వీటిలో  క్రికెట్ లో 7 సెంచరీ లు; 64 హాఫ్ సెంచరీ లు ఉన్నాయి. అత్యధిక స్కోరు 125 (నాటౌట్)

89 టి 20ల్లో  2,364 రన్స్ చేయగా వీటిలో 17 అర్ధ సెంచరీ లు ఉన్నాయి. అత్యధిక స్కోరు 97 (నాటౌట్)

అంతర్జాతీయ మ్యాచ్ లకు సంబంధించి…. 2002 ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా  టెస్ట్ క్రికెట్ ఆరంగ్రేటం చేసిన మిథాలీ 2021 సెప్టెంబర్ 30న తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడింది.

1999 లో ఐర్లాండ్ తో తన మొదటి వన్డే ఆడిన మిథాలీ ఐసిసి మహిళల వరల్డ్ కప్ లో భాగంగా మార్చి 27న సౌతాఫ్రికాతో తన చివరి వన్డే ఆడింది.

2006లో తన మొదటి టి 20మ్యాచ్ ఇంగ్లాండ్ పై ఆడిన ఆమె 2019 లో చివరి టి 20 మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ తోనే కావడం గమనార్హం.

మహిళా క్రికెట్ టెండూల్కర్ గా  పేరు సంపాదించిన మిథాలీ  ఆరుసార్లు ఐసిసి మహిళల వరల్డ్ కప్ ఆడి చరిత్ర సృష్టించింది. ఐతే వరల్డ్ కప్ గెలవాలన్న ఆమె కోరిక నెరవేరకుండానే రిటైర్  అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్