Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్మహిళల హాకీ: క్వార్టర్ ఆశలు సజీవం

మహిళల హాకీ: క్వార్టర్ ఆశలు సజీవం

టోక్యో ఒలింపిక్స్ మహిళా హాకీలో భారత జట్టు క్వార్టర్ ఆశలు సజీవంగా ఉన్నాయి. నేడు జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 4-3 తేడాతో భారత్ విజయం సాధించింది. నిన్న ఐర్లాండ్ పై ­1-0 తేడాతో విజయం సాధించిన ఇండియా నేడు రెండో విజయాన్ని నమోదు చేసుకుని పూల్ ‘ఏ’ లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.

నేటి మ్యాచ్ లో వందన కటారియా మూడు గోల్స్ సాధించి ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. నేహా గోయెల్ మరో గోల్ సాధించింది. ఇండియా తరఫున ఒక క్రీడాకారిణి వరుసగా మూడు గోల్స్ నమోదు చేసిన ఘనత నేహా దక్కించుకుంది.

సాయంత్రం ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్ ల మధ్య జరిగే మ్యాచ్ లో ఐర్లాండ్ ఓటమి పాలైనా, మ్యాచ్ డ్రాగా ముగిసినా  ఇండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుతుంది, కానీ ఐర్లాండ్ విజయం సాధిస్తే సమీకరణాలు మారిపోతాయి.  పూల్ ‘ఏ’ నుంచి నెదర్లాండ్స్, జర్మనీ, జట్లు ఇప్పటికే క్వార్టర్స్ కు చేరాయి.

నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్ లపై మూడు వరుస ఓటములు పాలైన ఇండియా జట్టు తరువాత కోలుకొని మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది. నిన్న ఐర్లాండ్, నేడు దక్షిణాఫ్రికాపై విజయాలు నమోదు చేసుకొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్