శుక్రవారం నుంచి మొదలు కానున్న ఐసిసి మహిళల టి20 వరల్డ్ కప్ కోసం సన్నాహక వామప్ మ్యాచ్ లో ఇండియా ఓటమి పాలైంది. సౌతాఫ్రికా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పది పరుగులకే మూడు కీలక వికెట్లు (కెప్టెన్ లన్నింగ్ డకౌట్, తహిలా మెక్ గ్రాత్-2; ఏలెస్సా పెర్రీ-1) కోల్పోయింది. బెత్ మూనీ-28; గార్డ్ నర-; చివర్లో వేర్హమ్-; జోనాస్సేన్- రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది.
ఇండియా బౌలర్లలో శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలా రెండు; రాజేశ్వరి గాయక్వాడ్ ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్యం స్వల్పమే అయినా ఇండియా బ్యాట్స్ విమెన్ తడబడ్డారు. 12 పరుగులకే మూడు కీలక వికెట్లు మన జట్టు కోల్పోయింది. జట్టు మొత్తంలో ముగ్గురే రెండంకెల స్కోరు (అంజలి శర్వాణి-11; హర్లీన్ డియోల్-12; దీప్తి శర్మ-19 నాటౌట్) దాటారు. స్మృతి మందానా, జెమీమా రోడ్రిగ్యూస్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. 15 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ నాలుగు; ఆష్లీ గార్డ్ నర్ రెండు; కిమ్ గ్రాత్; ఎలెస్సీ పెర్రీ, జెస్ జోనస్సేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.