Tuesday, March 10, 2026
HomeTrending Newsటోక్యో ఒలింపిక్స్: ఫైనల్ కు దహియా

టోక్యో ఒలింపిక్స్: ఫైనల్ కు దహియా

టోక్యో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ 57కిలొల విభాగంలో ఇండియాకు చెందిన రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ కు చేరుకున్నాడు. రెజ్లింగ్ విభాగంలో ఇండియాకు ఈ ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేశాడు. సెమిఫైనల్లో కజకిస్తాన్ కు చెందిన సనయేవ్ పై విజయం సాధించిన రవి ఫాల్ పాయింట్లతో  ఫైనల్ కు అర్హత సంపాదించాడు. రేపు జరిగే  ఫైనల్ లో ఇరాన్ కు చెందిన అత్రినాఘర్చి తో తలపడనున్నాడు.

మరోవైపు 86 కిలోల విభాగం సెమీ ఫైనల్లో దీపక్ పునియా అమెరికాకు చెందిన డేవిడ్ టేలర్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

రెజ్లింగ్ లో ఇండియా ఒలింపిక్స్ గత విజయాలు పరిశీలిస్తే  66 కిలోల విభాగంలో సునీల్ కుమార్ 2008 (బీజింగ్)లో  కాంస్యం; 2012లో (లండన్) రజత పతకాలు సాధించాడు.  2012 యోగేశ్వర్ దత్  60 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్ లో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ సాధించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular