శిఖర్ ధావన్ సారధ్యంలో ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు శ్రీలంకకు చేరుకుంది. నాలుగువారాల పాటు జరగనున్న ఈ టూర్ లో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ లు ఆడనుంది. జూలై 13న మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి. జూలై 13, 16, 18 తేదీల్లో వన్డే మ్యాచ్ లు, 21, 23, 25 తేదీల్లో టి-20 మ్యాచ్ లు ఉంటాయి. రాహుల్ ద్రావిడ్ ఈ జట్టు కోచ్ గా వ్యవహరిస్తుండగా, భువనేశ్వర్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు.
ఈ జట్టులో మొత్తం 20 మంది సభ్యులుండగా ఐపిఎల్ లో ప్రతిభ చాటిన ఆరుగురు ఆటగాళ్ళు దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, నితీష్ రానా, కృష్ణప్ప గౌతమ్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తిలు జాతీయ జట్టులో తొలిసారి స్థానం సంపాదించారు.
సోమవారం కొలంబో చేరుకున్న ఈ జట్టు రేపటి నుంచి మూడు రోజులపాటు క్వారంటైన్ గడపనుంది. ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది.
జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్య కుమార్ యాదవ్, మనీష్ పండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రానా, ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్, యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, క్రునాల్ పాండ్యా, గౌతం, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ (వైస్-కెప్టెన్). దీపక్ చాహర్, నవ దీప శైనీ, చేతన్ సకారియా
విరాట్ కోహ్లి సారధ్యంలో మరో 20 మంది సభ్యుల టీమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు జరిగే ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.