Sunday, January 19, 2025
HomeTrending Newsకేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను క్షేమంగా ఇండియా కు తీసుకు వచ్చేందుకు విమాన సర్వీసులను పంపేందుకు నిర్ణయం తీసుకుంది. భారతీయులందరి ప్రయాణ ఖర్చులు మొత్తం కేంద్రమే భరిస్తుంది.

రోమానియా, హంగరీ దేశాల ద్వారా భారత పౌరుల్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ లోని భారత రాయాబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. భారత పౌరులు ముఖ్యంగా విద్యార్థులు ఎంబసీతో నిత్యం టచ్ లో ఉండాలని, రోమానియా, హంగరీ దేశాల ద్వారా ఢిల్లీ విమానాలు అందుబాటులో ఉంటాయాని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఏలాంటి ఆందోళన కూడదని, భారతీయులు అందరు గ్రూపులుగా రోమానియా, హంగరి దేశాల సరిహద్దులకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ రాత్రి నుంచి భారత పౌరుల్ని తరలిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కీవ్ నగరంలోకి రష్యా బలగాలు వచ్చినందున ఇండియా పౌరులు భారత జాతీయ జెండా లేదా పేపర్ల మీద ప్రింట్లు తీసుకుని వాటిని చేతబూని రావాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Also Read : ఉక్రెయిన్ విషాదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్