Sunday, March 8, 2026
HomeTrending Newsచైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత

చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత

చైనా కవ్వింపు చర్యలతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దఫా ఈశాన్యంలోని ఆరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సరిహద్దులో ఇండో-చైనా సైన్యం మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఇరువైపులకు చెందిన జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురు భారత సైనికులను అత్యవసర చికిత్స నిమిత్తం గౌహతికి తరలించారు. ఈ ఘటన డిసెంబర్ 9 న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద జరిగింది. ఘటన అనంతరం కమాండర్ స్థాయి చర్చలు జరగడంతో ఇరువైపు సైనికులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ప్రాంతంలోని కొన్ని భూభాగాలు తమదిగా చైనా తప్పుడు ప్రచారం చేసుకుంటోంది. 2006 నుంచి ఇరుదేశాల మధ్య వివాదం నడుస్తున్నది.

మీడియా కథనాల ప్రకారం, ఈ ఘర్షణ 17 వేల అడుగుల ఎత్తులో జరిగింది. చైనా సైనికులు దాదాపు 300 మంది ఉండగా.. భారత సైనికుల సంఖ్య కూడా దాదాపు అంతే ఉన్నది. గతేడాది 200 మంది చైనా సైనికులు ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా భారత సైనికులు విజయవంతంగా అడ్డుకున్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఫేస్‌ టు ఫేస్‌ ఘర్షణ కొనసాగింది. ఇందులో భారత సైనికులకు ఎలాంటి నష్టం జరగలేదని, ప్రొటోకాల్ ప్రకారం చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకున్నట్లుగా తెలుస్తున్నది. కాగా, 2020 జూన్ 15న లడఖ్‌లోని గాల్వన్ లోయలో ఇరుసైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించగా, 38 మంది చైనా సైనికులు చనిపోయారు. నలుగురు సైనికులే చనిపోయినట్లు చైనా చెప్తూ వస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular