Saturday, January 18, 2025
HomeTrending Newsసింధు జలాలపై భారత్ పాక్ చర్చలు

సింధు జలాలపై భారత్ పాక్ చర్చలు

Indus : ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య సింధు జలాల పంపిణీపై చర్చలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. ముందస్తు వరద సమాచారం, సింధూ జలాల శాశ్వత వార్షిక నివేదికపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పాకల్ దుల్, పశ్చిమాన ప్రవహించే నదులపై భారతదేశం నిర్మిస్తున్న 48 మెగావాట్ల లోయర్ కల్నై, 624 మెగావాట్ల కిరు ప్రాజెక్టు జలవిద్యుత్ ప్రాజెక్టులపై ఇరుపక్షాలు పరస్పరం నివేదికలు అందచేశాయి.

పాకిస్థాన్ సింధు జలాల కమిషనర్ సయ్యద్ మెహర్ అలీ షా మాట్లాడుతూ… ఇది పీసీఐడబ్ల్యూ స్థాయిలో 118వ ద్వైపాక్షిక సమావేశం. అంతకుముందు, రెండు దేశాలు 2022 మార్చి 2-4 తేదీల్లో ఇస్లామాబాద్‌లో మూడు రోజుల చర్చలు జరిపాయని తెలిపారు. ఈ ప్రతినిధి బృందం వాఘా సరిహద్దు ద్వారా భారతదేశానికి వచ్చింది. ఈ నెల 30, 31 తేదీల్లో రెండు దేశాలు న్యూఢిల్లీలో పీసీఐడబ్ల్యూ స్థాయి చర్చలను నిర్వహించి, జూన్ 1న తిరిగి పాకిస్తాన్‌కు ప్రతినిధి బృందం చేరుకుంటుంది.

సింధు జలాల ఒప్పందం (IWT) 1960 ప్రకారం ఏటా జరిగే సమావేశం 370 ఆర్టికల్ రద్దు తర్వాత సింధు చర్చలను ఇరు దేశాలు స్తంభింపజేసాయి.
నిబంధనల ప్రకారం, ఇరుపక్షాలు ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా భారతదేశం లేదా  పాకిస్తాన్‌లలో ప్రత్యామ్నాయంగా సమావేశం కావాలి. మార్చి 23-24, 2021 తేదీలలో న్యూ ఢిల్లీలో జరిగిన చివరి సమావేశంలో, జలసంబంధమైన వరదల డేటా మార్పిడిపై చర్చలు జరిగాయి.
మార్చిలో జరిగిన చర్చల్లో రెండు దేశాలు సింధు జలాల ఒప్పందాన్ని దాని నిజమైన స్ఫూర్తితో అమలు చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

సట్లేజ్, బియాస్, రావి నదులపై భారత్ సంపూర్ణ హక్కులు కలిగి ఉండగా జీలం, సింధు, చెనాబ్ నడులపి పాకిస్తాన్ హక్కులు కలిగి ఉంది. సింధు జలాలపై చర్చలు జరుగుతున్నా పాక్ లోని కొత్త ప్రభుత్వం అదే పనిగా జమ్ము కాశ్మీర్ అంశాన్ని చర్చల్లో ప్రస్తావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్