Wednesday, June 17, 2026
Homeసినిమారూటు మార్చి 'గాంజా శంకర్' గా రాబోతున్న మెగా హీరో

రూటు మార్చి ‘గాంజా శంకర్’ గా రాబోతున్న మెగా హీరో

సాయిధరమ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా సక్సెస్ సాధించాడు. ఆతర్వాత వరుసగా ఫ్లాపులు కూడా చూశాడు. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత మాస్ సినిమాలకు దూరంగా ఫైట్స్ లేని థ్రిల్లర్ జోనర్ లో సినిమాలు చేయాలి అనుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది అందుకే మాస్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. మాస్ సినిమాలను బాగా డీల్ చేసి సంపత్ నంది డైరెక్షన్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని.. తెలిసింది. మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి గాంజా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం.

ఇది మాస్ కమర్షియల్ కథ. సీటీమార్ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా రాలేదు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ తో సినిమా సెట్స్ పై వెళ్ళడానికి రెడీ అవుతోంది. ‘గాంజా శంకర్’  టైటిల్ తేజ్ కి సెంటిమెంట్. మావయ్య చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్. చిరంజీవి శంకర్ దాదా సినిమా సూపర్ హిట్. అన్ని రకాలుగా ఈ టైటిల్ తనకి కలిసొస్తుందని తేజ్ భావిస్తున్నాడట. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన చేస్తారు. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది.

ఈ సినిమా తర్వాత తేజ్ నుంచి వస్తున్నబ్రో. ఇందులో పవన్ తో కలిసి నటించారు. సముద్రఖని ఈ చిత్రానికి డైరెక్టర్.  త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్ర్కీన్ ప్లే అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇది ఈ సంస్థకు 25వ చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జులై 28న బ్రో మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ ఉన్నారు కాబట్టి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆతర్వాత తేజ్ మాస్ సినిమా చేస్తే మరింత క్రేజ్ రావడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular