నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా శృతి హాసన్ నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ  టీజర్, సాంగ్స్ అండ్ ట్రైలర్ మూవీ పై అంచనాలను అమాంతం పెంచేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వీరసింహారెడ్డి చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

అయితే.. ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంటర్వెల్ సీన్ తో థియేటర్ దద్దరిల్లిపోతుందని అంటున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్, గోపీచంద్ మార్క్ టేకింగ్ తో వీరత్వం చూపించేలా ఇంటర్వెల్ సీన్ మొదలై ఒక ఎమోషన్ తో ఎండ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. సీనియర్ బాలకృష్ణకు చెల్లి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుందట. అయితే.. అన్నయ్యని నమ్మించి కత్తిపోటుతో బాలయ్యని చంపేస్తుందట. ఈ ఇంటర్వెల్ సీన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని.. యాక్షన్ కి యాక్షన్.. ఎమోషన్ కి ఎమోషన్ రెండు కలిపి అదిరింది అనేలా గోపీచంద్ మలినేని తెరకెక్కించారని టాక్.

సినిమా పై బజ్ చూస్తుంటే సంక్రాంతికి మరోసారి బాలయ్య వీరసింహారెడ్డి బీభత్సం సృష్టించేలా ఉంది. ఓ పక్క మాస్ యాక్షన్.. మరో పక్క ఎమోషన్ ఇలా రెండిటిని మిక్స్ చేసి గోపీచంద్ ఈ సంక్రాంతికి నందమూరి ఫ్యాన్స్ కు మంచి ఐ ఫీస్ట్ అందించే సినిమా ఇస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read : వీరసింహారెడ్డి కి యూ/ఎ సర్టిఫికేట్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *