Friday, March 29, 2024
Homeసినిమాఓ రేంజ్ లో 'పుష్ప 2' ఇంటర్వెల్ సీన్

ఓ రేంజ్ లో ‘పుష్ప 2’ ఇంటర్వెల్ సీన్

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. తెలుగు, మలయాళంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.  విదేశాల్లో సైతం పుష్ప మానియా కనిపించింది. దీంతో పుష్ప 2 మూవీ పై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం వైజాగ్ లో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉండబోతుంది..? కొత్త క్యారెక్టర్స్ ఉంటాయా..? పుష్ప రాజ్ క్యారెక్టర్ లో ఏదైనా మార్పు ఉంటుందా..? ఇలా అనేక ప్రశ్నలు. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ కి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.

ఇంటర్వెల్ బ్యాంగ్ అభిమానులతో పాటు ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తుందట. బన్నీ రెడ్ సాండల్ స్లగ్లర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే.  కూలీ నుంచి సిండికేట్ పగ్గాలని దక్కించుకున్న వ్యక్తిగా పుష్ప పార్ట్ 1 లో చూపించిన సుకుమార్ పార్ట్ 2లో మాత్రం బన్నీని రెడ్ సాండల్ స్మగ్లింగ్ ని దేశ విదేశాల్లో విస్తరించే డాన్ గా చూపించబోతున్నాడట.

ఇంటర్వెల్ బ్యాంగ్ లో డాన్ లుక్ లో ఓ రేంజ్ లో కనిపిస్తాడట. ఈ సీన్ సినిమాకు హైలైట్ గా నిలవనుందని ఇన్ సైడ్ టాక్. అంతే కాకుండా సినిమాలో పార్ట్ 1 కు మించిన స్థాయిలో కొత్త పాత్రలు వుంటాయని ఇవి సినిమాకు హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీ విషయంలో సుకుమార్ భారీ ప్లాన్ తో ముందుకు వెళుతున్నాడని ఊహించని స్టాండర్డ్స్ లో తెర పైకి తీసుకురాబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని 2024 జనవరికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి.. పుష్ప 2 తో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : ‘పుష్ప 2’లో చరణ్ క్యారెక్టర్ ఇదేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్