Sunday, January 19, 2025
Homeసినిమాశ్రీకాంత్ అడ్డాల.. కొత్త సినిమా పోస్టర్ రిలీజ్!

శ్రీకాంత్ అడ్డాల.. కొత్త సినిమా పోస్టర్ రిలీజ్!

‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఆతర్వాత ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. ఆతర్వాత తెరకెక్కించిన ‘బ్రహ్మోత్సవం’ ప్లాప్ అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత వెంకటేష్ తో ‘నారప్ప’  సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది.

ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంపై అప్ డేట్ వచ్చింది. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను, టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘పెదకాపు-1’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విరాట్ కర్ణను హీరోగా వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో విరాట్ కర్ణ ఇంటెన్స్ లుక్‌ ఆకట్టుకుంటోంది. భారీ జనసమూహంలో విజయానికి గుర్తుగా అభివాదం చేస్తూ కనిపించారు విరాట్ కర్ణ. పోస్టర్‌లో ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్‌‌లైన్‌ ఆసక్తి రేపుతోంది.చిత్రంలోని ఇతర తారాగణం గురించిన వివరాలేవీ ప్రకటించలేదు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్