Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్IPL-2023: మార్చ్ 31 నుంచి ఐపీఎల్, ఉప్పల్ లో ఏడు మ్యాచ్ లు

IPL-2023: మార్చ్ 31 నుంచి ఐపీఎల్, ఉప్పల్ లో ఏడు మ్యాచ్ లు

ఐపీఎల్ 16వ సీజన్ 2023 మార్చి నెల 31 నుంచి ఆరంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాంచైజీలు ఉన్నప్పటికీ క్రికెట్ కు ఇండియాలో ఉన్న ఆదరణ దృష్ట్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రేమికులకు ఓ పండుగ గా మారింది. అభిమానులకు ఆనందాన్నిచ్చే మరో అంశం… ఈసారి దేశవ్యాప్తంగా పన్నెండు ప్రాంతాల్లోనూ ఈ మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో వారి హోం గ్రౌండ్స్ తో పాటు గువహతి, ధర్మశాలలలో కూడా ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

2020లో మార్చ్ నెలలో మొదలు కావాల్సిన ఐపీఎల్ కోవిడ్ కారణంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించారు. 2021లో టోర్నీ మధ్యలో కోవిడ్ మరోసారి విజ్రున్భించింది. దీనితో మ్యాచ్ ను అర్ధంతరంగా నిలిపివేసి మళ్ళీ సెప్టెంబర్ లో యూఏఈలోనే నిర్వహించారు.

గత ఏడాది 2022లో ఇండియాలోనే జరిపినప్పటికీ లీగ్ మ్యాచ్ లు ముంబై, పూణే లోను, ప్లే ఆఫ్, ఫైనల్ ను కోల్ కతా, అహ్మదాబాద్ లోనూ నిర్వహించిన సంగతి తెలిసిందే. గత ఏడాది తొలిసారి ఈ టోర్నీలో అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్… ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ పై గెలుపొంది విజేతగా నిలిచింది.

2023 సీజన్ తొలి మ్యాచ్ గత విజేత గుజరాత్ టైటాన్స్ తన సొంత మైదానం అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. మే 31న ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరుగుతుంది.

ఏప్రిల్ 2,9, 18,24  మే 4, 13, 18 తేదీల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంత మైదానం ఉప్పల్ స్టేడియంలో ప్రత్యర్థులతో తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్