Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్హైదరాబాద్ : అదే తీరు

హైదరాబాద్ : అదే తీరు

ఐపీఎల్ లో హైదరాబాద్ కు మరో పరాయజం ఎదురైంది. నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్రమించిన హైదరాబాద్ ఈ సీజన్లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్ లు ఆడి తొమ్మిది ఓడిపోయింది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది.

టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో రాణించిన సన్ రైజర్స్ ఓపెనర్ జేసన్ రాయ్ ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విలియమ్సన్ కూడా త్వరగా ఔటయ్యాడు. ఓ వైపున ఓపెనర్ వృద్ధిమాన్ సాహా నిలకడగా ఆడుతున్నా సహచరుల నుంచి సరైన సహకారం అందలేదు. 46 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసిన సహా నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ-18; అబ్దుల్ సమద్ -18;  చివర్లో రషీద్ ఖాన్-17 (నాటౌట్) జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది.  చెన్నై బౌలర్లలో హజెల్ వుడ్-3, బ్రావో-2 వికెట్లు పడగొట్టగా శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై మొదటి వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. డూప్లెసిస్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 4  వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ధోనీ-14; రాయుడు-17 పరుగులతో అజేయంగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్-3, రషీద్ ఒక వికెట్ సాధించారు.

నాలుగు ఓవర్లలో 24పరుగులిచ్చి 3   కీలక వికెట్లు పడగొట్టిన హజెల్ వుడ్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్