Wednesday, March 18, 2026
Homeస్పోర్ట్స్IPL: ఢిల్లీకి మరో ఓటమి- రాజస్థాన్ విజయం

IPL: ఢిల్లీకి మరో ఓటమి- రాజస్థాన్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ ఓటమి పాలైంది. ఢిల్లీపై రాజస్థాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. గువహతి లోని బర్సప్ప క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్…20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్- బట్లర్ లు ధాటిగా ఆడి తొలి వికెట్ కు 98 పరుగులు చేశారు. జైస్వాల్ 31 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 60;  జోస్ బట్లర్ 51 బంతుల్లో 11 ఫోర్లు,1సిక్సర్ తో 79 రన్స్ సాధించారు. కెప్టెన్ సంజూ శాంసన్ డకౌట్ కాగా, రియాన్ పరాగ్ కేవలం 7 పరుగులే చేశాడు. హెట్మెయిర్ 21 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ తో 39; ధృవ్ జురెల్ -8రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు.  ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2; కుల్దీప్ యాదవ్, రోమన్ పావెల్ చెరో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తొలి ఓవర్లోనే… బౌల్ట్ బౌలింగ్ లో రెండు వికెట్లు (పృథ్వీ షా, మనీష్ పాండే లు డకౌట్) కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 7 ఫోర్లు 65; లలిత్ యాదవ్ 24 బంతుల్లో 5 ఫోర్లతో 38; రీలీ రోస్సో-14… ఈ ముగ్గురే రెండంకెల స్కోరు చేయగలిగారు, 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.

రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, యజువేంద్ర చాహల్ చెరో 3; రవిచంద్రన్ అశ్విన్ 2; సందీప్ శర్మ 1 వికెట్ పడగొట్టారు.

సూపర్ ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైశ్వాల్ కు ‘ప్లేయర్ అఫ్ ద ‘ మ్యాచ్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular