Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్రేసులో నిలిచిన బెంగుళూరు: గుజరాత్ పై గెలుపు

రేసులో నిలిచిన బెంగుళూరు: గుజరాత్ పై గెలుపు

RCB in race: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. నేడు ఆడిన చివరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ విసిరిన 169 పరుగుల లక్ష్య సాధనలో విరాట్ కోహ్లీ- డూప్లెసిస్ రాణించి తొలి వికెట్ కు 115 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టు విజయానికి బాటలు వేశారు. డూప్లెసిస్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లోనే స్టంప్ఔట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మాక్స్ వెల్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లతో 40; దినేష్ కార్తీక్-2 పరుగులతో నాటౌట్ గా నిలిచి మరో 8 బంతులుండగానే విజయం సాధించి పెట్టారు.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుభమన్ గిల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా-31 (రనౌట్), మాథ్యూ వాడే -16 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా-డేవిడ్ మిల్లర్ లు నాలుగో వికెట్ కు 61 పరుగులు జోడించారు. మిల్లర్ 34 స్కోరు చేసి అవుట్ కాగా, రాహుల్ తెవాటియా (2) విఫలమయ్యాడు.  రషీద్ ఖాన్ మరోసారి సత్తా చాటి 6 బంతుల్లో 1 ఫోర్, 2సిక్సర్లతో 19; పాండ్యా 47 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్సర్లతో 62 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లకు 168 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో హాజెల్ వుడ్ రెండు; హసరంగ, మాక్స్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు.

విరాట్  కోహ్లీకి కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : థాయ్ లాండ్ ఓపెన్: క్వార్టర్స్ కు సింధు

RELATED ARTICLES

Most Popular

న్యూస్