Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్రాజస్థాన్ పై బెంగుళూరు విజయం

రాజస్థాన్ పై బెంగుళూరు విజయం

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ పై అలవోకగా విజయం సాధించింది.  రాజస్థాన్ విసిరిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే సాధించింది. బెంగుళూరు ఆటగాడు గ్లెన్ మ్యాక్ వెల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి సొగసైన షాట్లతో అలరించాడు. 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసుకున్న బెంగుళూరు బౌలర్ యజువేంద్ర చాహల్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగుళూరు కెప్టెన్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ లో ఓపెనర్లు మినహా మిగిలిన వారు బ్యాటింగ్ లో విఫలమయ్యారు. ఓపెనర్లు లూయీస్, యశస్వి జైస్వాల్ తొలి వికెట్ కు 77 పరుగులు జోడించారు. జైస్వాల్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. లూయీస్ 37 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శ్యాంసన్-19; క్రిస్ మోరిస్ -14 పరుగలు చేశారు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది.  బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్-3, చాహల్, షాబాజ్ అహ్మద్ చెరో రెండు వికెట్లు, క్రిస్టియన్, గార్టన్ చెరో వికెట్ పడగొట్టారు.

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు మొదటి వికెట్ కు కోహ్లీ- పడిక్కల్  కు 48 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పడిక్కల్ 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కాసేపటికి కోహ్లీ (25) కూడా రనౌట్ అయ్యాడు. మూడో వికెట్ కు శ్రీకర్ భారత్- గ్లెన్ మ్యాక్స్ వెల్ 69 పరుగుల భాగస్వామ్యంతో జట్టు విజయానికి తోడ్పడ్డారు. భరత్ 35 బంతుల్లో  3 ఫోర్లు, 1 సిక్సర్ తో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.  మ్యాక్స్ వెల్ 30 బతుల్లో 6 ఫోర్లు 1సిక్సర్ తో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ కు రెండు వికెట్లు దక్కాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్