Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IPL: తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ కు పరాజయం

IPL: తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ కు పరాజయం

ఐపీఎల్ తాజా సీజన్ ను హైదరాబాద్ సన్ రైజర్స్ ఓటమితో మొదలు పెట్టింది. నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 72 పరుగులతో ఓటమి పాలైంది.

హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించి తొలి వికెట్ కు 84 పరుగులు చేసింది. బట్లర్ కేవలం 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 54; యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 9 ఫోర్లతో 54; కెప్టెన్ సంజూ శామ్సన్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 55; హెట్మేయిర్ -22 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.

హైదరాబాద్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకి, నటరాజన్ చెరో రెండు; ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ తొలి ఓవర్లోనే, పరుగుల ఖాతా తెరవక ముందే రెండు వికెట్లు కోల్పోయింది. ట్రెంట్  బౌల్ట్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి డకౌట్ గా వెనుదిరిగారు. జట్టు మొత్తంలో అబ్దుల్ సమద్ 32 రన్స్ తో హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. మయాంక్ అగర్వాల్-27; ఉమ్రాన్ మాలిక్ -19; ఆదిల్ రషీద్ -18 పరుగులు చేశారు.

20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4; బౌల్ట్ 2; హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

జోస్ బట్లర్ కు ‘ప్లేయర్ అఫ్ ద’ మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్