భారతదేశపు ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) నూతన అధిపతిగా ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుతం RAW చీఫ్‌గా ఉన్న సమంత్ గోయెల్ పదవీకాలం ఈ నెల 30న ముగియనుండటంతో.. ఆయన స్థానంలో కొత్త చీఫ్‌గా రవి సిన్హాను నియమించారు.
RAW నూతన అధిపతిగా రవి సిన్హా
రవి సిన్హా రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారని కేంద్ర వ్యక్తిగత మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నది. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రెటేరియట్ స్పెషల్ సెక్రెటరీగా ఉన్నారు. ప్రస్తుతం అప్పాయింట్స్ కమిటీ ఆయనను RAW సెక్రెటరీగా నియమించినట్లు ప్రకటించింది.